బిగ్‌బాస్4 డేట్ మారింది.. కొత్త పేర్లు రానున్నాయా..!

నెలలాఖ‌రు వ‌ర‌కు వ‌చ్చేస్తుందంటూ ఊరిస్తూ ఉన్న బిగ్‌బాస్ 4 తెలుగు సీజ‌న్ మ‌రోసారి పోస్ట్‌పోన్ అయిన‌ట్లు తెలుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆగ‌స్ట్ 30కి టెలికాస్ట్ చెయ్యాల‌నుకున్నా ఏవో కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల సెప్టెంబ‌ర్ 6 తేదీకి మారిన‌ట్లు స‌మాచారం. ఇక ఫైన‌ల్ అయిన కంటెస్టంట్స్ ని క్వారంటైన్‌లో ఉంచారు. వారికి క‌రోనా టెస్టులు చేస్తూ అన్ని ర‌కాల ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అయితే 3 కంటెస్టంట్స్‌కి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం కాగా. ఇన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా కంటెస్టంట్స్ క‌రోనాకి గురికావడం షో నిర్వాహ‌కుల‌కు ఆందోళ‌న క‌లిగిస్తుంద‌ట‌.

ఇక తాజాగా గీతామాధురి భ‌ర్త నందు తొంద‌ర‌ప‌డి తాను బిగ్‌బాస్‌లో పాల్గొంటున్నానంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. మ‌రి నందు ప్లేస్‌లో మ‌రొక‌రిని సెలెక్ట్ చెయ్య‌డానికేనా ఈ పోస్ట్ పోన్ అనే సందేహాలు వ‌స్తున్నాయి. కాగా ఫైన‌ల్ కంటెస్టంట్స్ లిస్ట్ లీక్ కావ‌డ‌మూ మ‌రో కార‌ణంగా ఉండి ఉండ‌వ‌చ్చు. గ‌త సీజ‌న్‌లో అద‌ర‌గొట్టిన నాగ్ ఈ సీజ‌న్‌లో మ‌రో రేంజ్‌లో ఉండేలా చేస్తాడ‌న‌డంలో సందేహం లేదు. కారణాలు ఏమైన‌ప్ప‌టికీ వారం రోజులు వెనక్కి త‌గ్గారు బిగ్‌బాస్‌. కొత్త‌గా కొత్త పేర్లూ రావొచ్చేమో మ‌రి.. చూద్దాం.