ట్రెండ్ ఇన్: నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ‘బిగ్ బాస్..టైటిల్ విన్నర్ ఎవరో?

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’..సీజన్ సిక్స్..ఓటీటీ వర్షన్ రసవత్తరంగా సాగుతోంది. పదో వారంలోకి ఎంటర్ అయిన ఈ షోలో కంటెస్టెంట్స్ తమ గేమ్ పైనే ఫోకస్ చేస్తున్నారు. ‘బిగ్ బాస్’ టీమ్ ఇస్తు్న్న టాస్కులను కంప్లీట్ చేసి టాప్ ఫైవ్ లో నిలవడమే కాదు.టైటిల్ గెలుచుకోవాలని అనుకుంటున్నారు.

ఇక ఈ షో ఓటీటీ వర్షన్ అనగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న నేపథ్యంలో ప్రజలకు, బీబీ లవర్స్ కు 24 బై 7 ఎంటర్ టైన్మెంట్ అందుతోంది. అయితే, ఓటీటీ లో స్ట్రీమ్ అవుతున్న నేపథ్యంలో కంటెస్టెంట్స్ హద్దులు దాటి మాట్లాడుతున్నారు. ఈ విషయమై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తు్న్నారు.

హోస్ట్ నాగార్జున వీకెండ్స్ లో వచ్చి చేసే హంగామా కూడా బీబీ లవర్స్ ను అలరిస్తోంది. మొత్తంగా ఓటీటీ లో బిగ్ బాస్ షో ఊహించిన మేరనే కాదు కొంచెం ఎక్కువే ఎంటర్ టైన్ చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోమవారం ఎపిసోడ్ లో ఆడపులి అలియాస్ బిందు మాధవి తన పర్ఫార్మెన్స్ తో సత్తా చాటింది. ఈ క్రమంలోనే ఆమెకు ఓటింగ్ పర్సంటేజీ కూడా బాగానే వచ్చింది.

ఈ క్రమంలోనే బీబీ లవర్స్ హ్యాష్ ట్యాగ్ బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరిట ట్వీట్స్ చేశారు. బిందు మాధవిని సపోర్ట్ చేయాలని, ఆమెకు ఓటే యాలని ఈ సందర్భంగా కోరుతున్నారు. అలా ట్వి్ట్టర్ లో వరుస ట్వీట్స్ చేయడం వలన #BiggBossNonStop హ్యాష్ ట్యాగ్ బిగ్ బాస్ నాన్ స్టాప్..మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

ఇప్పటి వరకు వచ్చిన ఓటింగ్ పర్సంటేజీలో బిందు మాధవి ఫస్ట్ ప్లేస్ లో ఉండటం విశేషం. 32 శాతం ఓటింగ్ తో బిందు మాధవి దూసుకెళ్తోంది. ఇదే విధంగా కొనసాగితే కనుక డెఫినెట్ గా బిందు మాధవి బిగ్ బాస్ ఓటీటీ టైటిల్ గెలుచుకుంటుందని బీబీ లవర్స్, రివ్యుయర్స్ అంచనా వేస్తున్నారు. చూడాలి మరి..ఏం జరుగుతుందో..చివరకు ఎవరు టైటిల్ గెలుచుకుంటారో..

Read more RELATED
Recommended to you

Latest news