మంత్రి పదవి చేపట్టి వారం రోజులు కూడా కాక ముందే బీహార్ కి చెందిన విద్యాశాఖా మంత్రి తన పదవికి రాజీనామా చేసారు. మంత్రి మేవలాల్ చౌదరి గురువారం తన క్యాబినెట్ పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అవినీతి ఆరోపణలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఆయన నియామకంపై ప్రతిపక్ష పార్టీ రాష్ట్ర జనతాదళ్ ఆరోపణలు చేసిన సాయంత్రానికి ఆయన రాజీనామా చేసారు.
161 అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరియు జూనియర్ శాస్త్రవేత్తల నియామకాన్ని ఆయన 2017 లో భాగల్పూర్ యొక్క సబౌర్ అగ్రికల్చర్ యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్గా ఉండి ప్రభావితం చేసారని ఆరోపణలు వచ్చాయి. ఇక అవినీతికి సిఎం నితీష్ కుమార్ మేవలాల్ చౌదరికి బహుమతి ఇస్తున్నారని ఆర్జెడి నాయకుడు తేజశ్వి యాదవ్ బుధవారం ఆరోపించారు. ఇక ఇదిలా ఉంటే ఆయనకు వందేమాతరం రావడం లేదని ఒక వీడియో నేడు బాగా వైరల్ అయింది. ఈ వీడియోని ఆర్జెడి షేర్ చేసింది.