బీహార్లో బీజేపీ, జేడీయూ మధ్య కుదిరిన డీల్…

-

బీహార్ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ మధ్య డీల్ ఓకే అయ్యింది. మొత్తం 243 సీట్లను రెండు పార్టీలు చెరిసగం పంచుకున్నాయి. జేడీయూకు 122 సీట్లు దక్కగా, బీజేపీ 121 సీట్లలో పోటీకి దిగాలని నిర్ణయించుకన్నాయి. 122 సీట్లలోనే నితీష్ జితిన్ రాం మాంఝీకి సీట్లివ్వనున్నారు. ఇక ఎల్జేపీ బీజేపీతో కలిసి వస్తే…121 సీట్లలోనే ఎల్జేపీకి సర్ధుబాటు చేయాలని నిర్ణయించారు. గురువారం నుంచి నామినేషన్ల పర్వం మొదలైన నేపధ్యంలో రెండు పార్టీలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ..సీట్ల పంపిణీని స్పీడప్ చేశాయి.

ఎల్జేపీ తలనొప్పి మినహా…ఎన్డీయేలో సీట్ల పంపిణీ వ్యవహారం సజావుగానే సాగిందని చెప్పాలి. అదే మహాఘట్ బందన్ లో మాత్రం కాస్త సంక్షిష్టంగానే కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, ఆర్జెడీ మధ్య మాట వ్యవహారం కాస్త ముదిరింది. విమర్శలు, ప్రతి విమర్శలు బాగానే సాగాయి. ఒకానొక దశలో తాము ఒంటరిగానే బరిలో దిగుతామని కాంగ్రెస్ సంకేతాలు కూడా ఇచ్చింది. చివరికి శనివారం నాటికి వారిద్దరి మధ్య సీట్ల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news