వీధి కుక్కలపై వేట ప్రకటించిన బీహార్‌ ప్రభుత్వం..! కనిపిస్తే కాల్చేయడమే..

-

పెంచుకునే కుక్కలైతే కరుస్తాయో లేదో చెప్పొచ్చు.. కానీ వీధుల్లో తిరిగే కుక్కల స్వభావం ఎలా ఉంటుందో చెప్పలేం.. ఏటా వీధి కుక్కల వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి.. అవి వెంటపడటం, వాహనాలకు అడ్డురావడంతో సడన్‌ బ్రేక్‌ వేసి ప్రమాదాలకు గురికావడం జరుగుతుంది. ఇంకా నడుచుకుంటూ వెళ్లేవారిని వెంటాడి కరవడం కూడా మామూలే.. గత సంవత్సరం బీహార్‌లో తొమ్మిది మహిళలు వీధి కుక్కల దాడిలో మరణించారట.. దాంతో.. అక్కడి ప్రభుత్వం గట్టి నిర్ణయమే తీసుకుంది. వీధికుక్కల వేట మొదలేసింది.
బిహార్ ప్రభుత్వం గత సంవత్సరం వీధి కుక్కల దాడిలో తొమ్మిది మంది మహిళలు మరణించినట్లు వెల్లడించింది. ఇక చాలా మంది తీవ్ర గాయాలపాలయ్యారు. చాలా గ్రామాల్లో విధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి..గత నెలలోనే నలుగురు మరణించారు. ఇది ఎంత వరకు వెళ్లిందంటే.. కొన్ని కుక్కలు మనుషుల్ని తినేందుకు బాగా రుచిమరిగాయట..దాంతో.. బిహార్ ప్రభుత్వం కుక్కలపై వేట ప్రారంభించింది. గురువారం మధ్యాహ్నం నాటికే ఒక్క బెగుసరై జిల్లాలోనే 24 కుక్కల్ని ప్రభుత్వం నియమించిన ఒక బృందం కాల్చి చంపేసింది. మంగళవారం 15 కుక్కల్ని హతమార్చారు. బుధవారం 9 కుక్కల్ని మట్టుబెట్టారు. ఒక్క జిల్లాలోనే ఈ సంఖ్యలో జరుగుతుంటే, ఇక రాష్ట్రంలో జరిగే సంఖ్య ఎంతుంటుందో..

అన్నీ పక్కనపెట్టి కుక్కల పైనే పోరాటం..

వాస్తవానికి రాష్ట్రంలో అక్రమ మద్యం అంశం చాలా రోజులుగా వివాదాస్పంగా ఉంది. ఇక రాష్ట్ర ప్రజల ఆర్థిక పరిస్థితి, విద్యా పరిస్థితులు, జీవిన విధానంపై అనేక విమర్శలు ఉన్నాయి. వీటన్నిటినీ కాదని, వీధి కుక్కల్ని హతమార్చే కార్యక్రమం ఎందుకు ప్రారంభించారనే ప్రశ్న వెనుక పెద్ద కారణమే ఉందని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో ప్రజలపై వీధి కుక్కల దాడులు ఎక్కువయ్యాయి..అనేక మంది ప్రాణాలు సైతం కోల్పోతున్నారట. ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఫిర్యాదులు నమోదు అవుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.. ముఖ్యంగా బెగుసరై, బచ్చవారా జిల్లాల్లో ఈ దాడులు విపరీతంగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో వీధి కుక్కల్ని నిర్మూలించి ప్రజల్ని కాపాడడం కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం. వారికి ఆయుధాలిచ్చి, వీధి కుక్కలపై షూటింగ్ ఆర్డర్స్ ఇచ్చేసింది. ఇక యుద్ధంలో ఎన్ని కుక్కలు మరణించబోతున్నాయో..! అయితే కొందరు జంతుప్రేమికులు మాత్రం ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.. మీరేమంటారు..?

Read more RELATED
Recommended to you

Latest news