ప్రాణం తీసిన బైక్ లిఫ్ట్ .. ఒకరు మృతి.. ఇంకొకరు ఆత్మహత్య !

-

వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు ఒకే ఊరికి చెందిన వాళ్లైనా, బంధువులైనా కలిస్తే వాళ్ల బైక్ ఉంటే ఎక్కి వెళ్లిపోతాం. అలానే ఓ మహిళ తన ఊరికి చెందిన అబ్బాయి అని లిఫ్ట్ అడిగింది. యువకుడి బండి మీద ఎక్కించుకున్నాడు. కానీ విధి వక్రీంచింది. బైక్ అదుపు తప్పడంతో మహిళ కిందపడటంతో ఆమెకు గాయమయ్యాయి. తీవ్ర రక్త స్రావం కావడంతో మహిళ అక్కడికక్కడే మరణించింది. వివరాళ్లోకి వెళితే..

crime
crime

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప అమ్రాబాద్ పంచాయతీ పరిధిలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. గుండ్యానాయక్ తండాకు చెందిన నివర్తి (24) పని కోసం మంచిప్ప వెళ్తుంటే అదే తండాకు చెందిన లక్ష్మీబాయి (52) నేను మంచిప్ప వెళ్లాలని, నన్ను తీసుకెళ్లమని కోరింది. సరే అని బైకి మీద ఎక్కించుకున్నాడు నివర్తి. కొంచెం దూరం ప్రయాణించాక బైక్ అదుపు తప్పడంతో కిందపడిన లక్ష్మిబాయి తల పగిలి అక్కడికక్కడే చనిపోయింది. దీంతో ఇంటికి చేరుకున్న నివర్తి భయంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అరగంటలో ఇద్దరి ప్రాణాలు పోవడంతో కుటుంబ సభ్యుల్లో, తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news