బింబిసార ఓటీటీ డేట్ ఫిక్స్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే !

-

హీరో కల్యామ్​రామ్​ నటించిన ‘బింబిసార’ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్​ వద్ద మంచి వసూళ్లను అందుకుంది. బింబిసారా చిత్రం భారీ అంచనాల మధ్య ఆగస్టు 5న గ్రాండ్ గా రిలీజ్ అయింది. విడుదలైన తొలి షో నుంచే ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో కళ్యాణ్ రామ్ సరికొత్త లుక్ లో కనిపించాడు.

బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను జీ5 ఓటీటీ దక్కించుకున్నది. అయితే ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త చెప్పింది చిత్రం బృందం. అయితే దీపావళి కానుకగా ఈనెల 21వ తేదీన ఈ సినిమా ఓటీటీ లో రిలీజ్ కానుంది. Zee 5 అనే ఓటీటీ లో రిలీజ్ కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news