కోవిడ్ 19: గ్రీన్ ఫంగస్.. లక్షణాలు.. తెలుసుకోవాల్సిన విషయాలు.

-

కరోనాతో తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఫంగస్ ఇన్ఫెక్షన్లు మరింత తీవ్రంగా మారాయి. కరోనా నుండి కోలుకున్న వారిలో వచ్చే ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఆందోళనకి గురి చేస్తున్నాయి. మొదట బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ ఇంకా యెల్లో ఫంగస్ కూడా వచ్చింది. ఈ ఫంగస్ కేసులు కూడా ఎక్కువ అవడం చూస్తూనే ఉన్నాం. మరణాలు కూడా ఎక్కువే ఉన్నాయి. ఐతే తాజాగా గ్రీన్ ఫంగస్ కేసు కూడా నమోదయ్యింది. ఇండోర్ కి చెందిన ఒకానొక వ్యక్తిలో ఈ గ్రీన్ ఫంగస్ ని కనుక్కున్నారు.

గ్రీన్ ఫంగస్

ఐతే మొదటి మూడు ఫంగస్ ఇన్ఫెక్షన్లకి దీనికి తేడా ఏమిటి? గ్రీన్ ఫంగస్ ఇన్ఫెక్షన్ల లక్షణాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని ఆస్పర్జిల్లోసిస్ అని కూడా అంటారు. ఆస్పర్జిల్లస అనే ఫంగస్ వలన వస్తుంది. ఇది సాధారణంగా ఇంట్లో, బయట కూడా జీవిస్తుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండి, బలహీనంగా ఉన్నవారిలో లేదా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నవారిలో ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ కనిపిస్తుంది.

భారతదేశంలో మొదటి గ్రీన్ ఫంగస్ కేసు ఇండోర్ వ్యక్తిలో ముంబైలో కనుగొన్నారు. తనకి బ్లాక్ ఫంగస్ సోకిందేమో అన్న అనుమానంతో టెస్టులు జరపగా వైద్యులను ఆశ్చర్యపరిచేలా గ్రీన్ ఫంగస్ కనబడింది.

ఆకుపచ్చ ఫంగస్ యొక్క లక్షణాలు

ఈ ఫంగస్ లక్షణాల్లో ముఖ్యమైనది ముక్కులో నుండి రక్తం కారడం. ఇంకా తీవ్ర జ్వరం, అససిపోవడం, బలహీనంగా మారిపోవడం అలాగే తొందరగా బరువు తగ్గిపోవడం కనిపిస్తుంటుంది. మొదటి గ్రీన్ ఫంగస్ కేసులో ఈ లక్షణాలన్నీ కనిపించాయని వైద్యులు చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news