బిగ్ బాస్ ఓ టీ టీ లో మొదటిసారి నాన్-స్టాప్ బిగ్ బాస్ ప్రసారం అయిన విషయం అందరికి తెలిసిందే. అయితే నాన్ స్టాప్ గా బిగ్బాస్ ప్రసారం అవుతుండడం చూసి ఎన్నో విమర్శలు వినిపించాయి. మొత్తం 18 కంటెస్టెంట్ లతో మొదలైన ఈ షో నీ 24 గంటల పాటు ఎవరు చూస్తారు అంటూ చాలామంది కామెంట్ కూడా చేశారు. కానీ కంటెంట్లో హైలెట్ ని చూడడం ప్రారంభించిన తర్వాత అభిమానులు కూడా చూడడానికి బాగా అలవాటు పడిపోయారు . ఇకపోతే అప్పటినుంచి బిందుమాధవి , అఖిల్ నామినేషన్స్ అస్సలు మిస్ అవకుండా చూడడం స్టార్ట్ చేశారు. రెండో వారం నుంచి అఖిల్ తో గట్టిగా గేమ్ ఆడింది. సై అంటే సై అంటూ నామినేషన్ లో తన పవర్ ఏంటో చూపించింది ఈ ఆడపులి.
బిగ్ బాస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా బిందుమాధవి ఆడపులి లా గేమ్ ఆడుతూ ఉంది అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్నో విమర్శలు, ఒంటరితనం, గొడవలు పడినా ఒంటరిగా తానేమిటో నిరూపించింది. ఆడ పులి లా విజృంభించింది. ఇకపోతే లాస్ట్ రౌండ్ లో కింగ్ నాగార్జున గోల్డెన్ బ్రీఫ్ కేస్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక బ్రీఫ్ కేసు లో డబ్బు ఉందని అందులో పది లక్షలు అరీయానా తీసుకుంది అని అలాగే మీరు కూడా ఇందులో అమౌంట్ తీసుకోవచ్చు అనిస్ కూడా తెలిపాడు. కానీ బిందు మాధవి – అఖిల్ ఇద్దరూ కూడా బ్రీఫ్ కేస్ ను తీసుకోవడం రిజెక్ట్ చేశారు.
దీంతో ఇద్దరిని స్టేజ్ పైకి తీసుకొని వచ్చాడు నాగార్జున. ఇద్దరి చేతులను పట్టుకొని పైకి లేపుతూ చాలాసేపు ఉత్కంఠభరితంగా ఫినాలే విన్నర్ ను అనౌన్స్ చేయడం జరిగింది. బిందుమాధవి విన్నర్ అని చెప్పగానే హౌస్మేట్స్ అందరూ ఒక్కసారిగా గోల చేశారు. సపోర్టర్స్ అందరూ ఉత్సాహంతో రెచ్చిపోయారు . ఇక అఖిల్ లాస్ట్ టైం సీజన్ ఫోర్ లో లాగే కూడా ఈసారి కూడా రన్నర్ గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది . ఇక బిందు మాధవి ఆనందంతో కూడిన ఎమోషనల్ అయింది. ఇకపోతే బిందుమాధవి తన అమ్మానాన్నలను గట్టిగా హత్తుకొని మీ కూతురు గెలిచింది అంటూ సంతోషం వ్యక్తం చేసింది. ఇక సక్సెస్ అనేది ఎప్పటికైనా వస్తుందని..లేటుగా వస్తే నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు అని ఆమె స్పీచ్ ఇచ్చింది. సక్సెస్ రాకుండా ఎదురుచూస్తున్న వారందరికీ ఈ టైటిల్ని అంకితం చేస్తున్నాను అంటూ ఆమె తెలిపింది. ఎవరు ఎన్ని చెప్పినా కష్టపడితే విజయం మనదే అంటూ తెలిపింది బిందుమాధవి.