అత్యంత ప్రతిష్ఠాత్మక సదస్సు అయిన బయో ఆసియా సదస్సుకు హైదరాబాద్ నగరం వేదిక అయింది. 20వ బయో ఆసియా సదస్సు నేటి నుంచి నుంచి ప్రారంభం కానుంది. ‘అడ్వాన్సింగ్ ఫర్ వన్: షేపింగ్ నెక్స్ట్ జనరేషన్ హ్యూమనైజ్డ్ హెల్త్‌కేర్’ ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ సదస్సు హెచ్‌ఐసీసీలో మూడు రోజుల పాటు కొనసాగనుంది. దీనికి యూకే భాగస్వామ్య దేశంగా వ్యవహరిస్తోంది.
ఇవాళ ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సదస్సులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్, నోవార్టిస్ సీఈఓ డాక్టర్ వాస్ నరసింహన్, ఐటీ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొంటారు. బయోటెక్, లైఫ్ సైన్సెస్ విభాగంలో పలు అంకురాలు పాల్గొని తమ ఉత్పత్తులు ప్రదర్శించనున్నాయి.
సదస్సులో పాల్గొనేందుకు 400లకుపైగా అంకురాలు పోటీపడగా 75 సంస్థలను ప్రాథమికంగా ఎంపిక చేశారు. వాటిలోంచి తుది జాబితాకు 5 ఎంపికయ్యాయి. జీవశాస్త్రంలో విశేష కృషి చేసిన వారికి అందించే జీనోమ్ వ్యాలీ ఎక్స్‌లెంట్ పురస్కారాన్ని ఈ ఏడాది ఆచార్య రాబర్ట్ లాంగర్‌కు ప్రదానం చేస్తున్నారు.