దేశ తొలి సీడీఎస్ బిపిన్ రావత్ మరణంపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. బిపిన్ రావత్ మరణం తీరని లోటుగా దేశం భావిస్తోంది. దేశంలోని రాజకీయ నాయకులు, ప్రముఖులు ఆయన మరణం పట్ల తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. దేశ తొలి సీడీఎస్ గా అత్యున్నత సేవలు చేశారని కొనియాడుతున్నారు. ఇతర దేశాలు కూడా ఆయనతో ఉన్న సంబంధాలను గుర్తు చేసుకుంటున్నాయి. దయాది దేశం పాకిస్థాన్ బిపిన్ రావత్ మరణంపై సంతాపం వ్యక్తం చేసింది. నేపాల్ కూడా రావత్ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
తాజాగా బిపిన్ రావత్ మరణం పట్ల అగ్రరాజ్యం అమెరికా కూడా తన సంతాపాన్ని తెలియజేసింది. స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాట్లాడుతూ.. యూఎస్ – భారత రక్షణ భాగస్వామ్యంలో బిపిన్ రావత్ చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు పెంపొందించేందుకు దోహదపడ్డారన్నారు. భారత సాయుధ బలగాలు, ఏకీక్రుత యుద్ధ సంస్థగా మారడంలో ఆయన కేంద్ర బిందువుగా ఉన్నారని.. అమెరికా తన సంతాప సందేశాన్ని తెలియజేసింది.