హెలికాప్టర్ ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ అధికారిగా ముత్తు మాణిక్యం ను నియామకం చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం.. ఊటీలో ADSP అధికారిగా ముత్తు మాణిక్యం పని చేస్తున్నారు. ఆయన అయితే.. ఈ ప్రమాదంపై సమర్థవంతంగా పని చేస్తారని భావించిన కేంద్ర ప్రభుత్వం.. హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ అధికారిగా ముత్తు మాణిక్యం ను నియామకం చేసింది. మరో రెండు రోజుల్లోనే.. దీనిపై మత్తు మాణిక్యం విచారణ ప్రారంభించనున్నారు.
కాగా.. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం పై లోక్ సభ లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇవాళ ఉదయం కీలక ప్రకటన చేశారు. నిన్న జరిగిన విమాన ప్రమాద ఘటనలో ఏకంగా 13 మంది దుర్మరణం చెందారు అని రాజ్నాథ్ సింగ్ లోక్సభలో వెల్లడించారు. హెలికాప్టర్ కూలి పోవడాన్ని స్థానికులు గమనించారు అని తెలిపారు. హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ ప్రారంభం అయిందని రాజ్ నాథ్ సింగ్ చేశారు.