బయటపడుతున్న బర్ద్ ఫ్లూ కేసులు… ఎక్కడంటే

-

ఒకపక్క కరోనా గజగజవణుకుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా బర్ద్ ఫ్లూ కేసులు బయటపడుతుండడం అందరినీ కలవరపెడుతుంది. ఈ కొత్తగా బర్ద్ ఫ్లూ కేసులు ఎక్కడ అంటే భారత్ లోని కేరళ లో వెలుగుచూసినట్లు తెలుస్తుంది. కేరళలోని కోజిక్కోడ్ లో బర్ద్ ఫ్లూ కేసులు వెలుగులోకి రావడం తో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ జిల్లా లోని రెండు కోళ్ల ఫారాల్లో ఈ ఫ్లూ వ్యాధి కనిపించడం తో ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు చేపట్టింది. ప్రభావిత ప్రాంతాలకు ఒక కిలోమీటరు పరిథిలో బాతులు, కోళ్ళను వధించాలని అధికారులు ఆదేశించారు. ఎవియన్ ఫ్లూ (బర్డ్ ఫ్లూ) కనిపించడంతో కొజిక్కోడ్ జిల్లా కలెక్టర్ శ్రీరామ్ సాంబశివ రావు శనివారం అత్యవసర సమావేశం నిర్వహించి పశు సంవర్థక శాఖ, ఆరోగ్య శాఖ, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ వ్యాధి వ్యాప్తిని నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ వైరస్ వల్ల ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదంటూ అధికారులు భరోసా ఇచ్చారు. ఈ వ్యాధి కనిపించిన రెండు కోళ్ళ ఫారాల నుంచి ఒక కిలోమీటరు పరిథిలోని అన్ని కోళ్ళు, బాతులు, ఇతర పక్షులను వధించేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

సమీప ప్రాంతాలకు ఈ వైరస్ విస్తరించకుండా నిరోధించేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు వారు తెలిపారు. ఇప్పటికే చైనా లో మొదలైన ఈ కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను విస్తరించింది. ఈ కరోనా తో భయపడుతుండగా అక్కడక్కడ స్వైన్ ఫ్లూ కేసులు కూడా కనిపిస్తుండడం ఇప్పుడు తాజాగా బర్డ్ ఫ్లూ కూడా కనిపిస్తుండడం తో అధికారులు ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news