బర్తడే స్పెషల్ : కృష్ణ – మహేష్ బాబు కలసి నటించిన సినిమాలు ఏంటో తెలుసా..?

-

ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ లాంటి ఎంతో మంది హీరోలు తమ వారసులతో కలిసి నటించిన విషయం మనకు తెలిసిందే. ఇక సూపర్ స్టార్ కృష్ణ కూడా తన కొడుకు రమేష్ బాబు అలాగే మహేష్ బాబుతో కలిసి నటించిన ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చి.. మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇకపోతే ఈరోజు కృష్ణా తన 79వ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో తన కొడుకుతో కలిసి ఎన్ని సినిమాల్లో నటించారు అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సూపర్ స్టార్ కృష్ణ , మహేష్ బాబు తో కలిసి ఏకంగా పది చిత్రాల్లో నటించారు. ఇక ఆ చిత్రాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

1. పోరాటం:Poratam Telugu Full Movie HD | Mahesh Babu | Krishna | Jayasudha | Hit Telugu Movies | Divya Media - YouTubeకోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించారు. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు మొదటి సారి తన తండ్రితో కలిసి.. అన్నదమ్ములుగా నటించారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

2. శంఖారావం:Shankaravam-Movie-Krishna-Mahesh-Babu-Rajani-Bhanupriya » Babu Chitti (బాబు చిట్టి)కృష్ణ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మహేష్ బాబు రెండవ సారి తన తండ్రితో కలిసి నటించాడు. ఇక ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా నటించి బాక్సాఫీస్వద్ద సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకున్నారు.

3. బజారు రౌడీ:BAZAAR ROWDY | TELUGU FULL MOVIE | RAMESH BABU | MAHESH BABU | GAUTAMI | NADIYA | TELUGU CINE CAFE - YouTubeమహేష్ బాబు, రమేష్ బాబు హీరోలుగా నటించిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ అతిధి పాత్రలో నటించారు. కృష్ణ తన ఇద్దరు కొడుకుల తో ఈ సినిమాలో నటించడం గమనార్హం.

4. ముగ్గురు కొడుకులు:Mugguru Kodukulu-ముగ్గురు కొడుకులు Telugu Full Movie | Krishna | Radha | Mahesh Babu | TVNXT Telugu - YouTubeఈ సినిమాలో కృష్ణ తో పాటు తన ఇద్దరు కొడుకులు కూడా నటించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది..

ఇవే కాకుండా గూడచారి 117, కొడుకు దిద్దిన కాపురం, అన్న తమ్ముడు వంటి సినిమాలలో మహేష్ బాబు బాలనటుడిగా నటించగా.. ఇక సోలో హీరోగా వచ్చిన రాజకుమారుడు, వంశీ , టక్కరి దొంగ వంటి సినిమాలలో అతిధి పాత్రలో నటించారు కృష్ణ.

Read more RELATED
Recommended to you

Latest news