ఇక “సాక్షి” ఇస్మార్ట్‌ వార్తలు .. సాక్షి టీవీలోకి బిత్తిరి సత్తి..

-

బిత్తిరి సత్తి అలియాస్‌ చేవెళ్ల రవి ఇటీవలే టీవీ9కు రాజీనామా చేసిన విషయం విదితమే. అయితే టీవీ9 కావాలనే సత్తిని పంపేసిందని, లేదు.. అతనే రాజీనామా చేశాడని, కాదు.. బిగ్‌బాస్‌ షోలో పాల్గొనేందుకు రాజీనామా చేశాడని.. అప్పటి నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వీటికి తెరదించుతూ సత్తి కొత్త అవతారం ఎత్తనున్నాడు. ఇకపై అతను సాక్షి టీవీలో కనిపించనున్నాడు. ఈ మేరకు ఆ టీవీ చానల్‌ యాజమాన్యంతో సత్తి డీల్‌ కన్‌ఫాం అయినట్లు తెలుస్తోంది.

bithiri sathi joined in sakshi tv

గతంలో టీవీ9 వారు అందజేసిన ప్యాకేజీ మొత్తానికే సత్తి ఓకే చెప్పాడని సమాచారం. దీంతో సత్తి ఇక సాక్షి టీవీలో కనిపించనున్నాడు. అయితే అందులో కూడా ఇస్మార్ట్‌ వార్తల పేరిటే ఏదైనా కార్యక్రమం పెడతారని తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు వీ6 న్యూస్‌, టీవీ9లలో స‌త్తి రెండు భిన్న గెటప్‌లలో అలరించాడు. కానీ సాక్షిలో మరో కొత్త అవతారంలో దర్శనమివ్వనున్నట్లు తెలిసింది. తనదైన శైలితో అలరిస్తూనే భిన్న గెటప్‌లో కనిపించనున్నాడని టాక్‌ వినిపిస్తోంది.

అయితే టీవీ9 నుంచి బయటకు వచ్చాక సత్తి బిగ్‌బాస్‌ షోలోనే పాల్గొంటాడని అందరూ అనుకున్నారు. కానీ దాని కన్నా ముందుగానే అతను సాక్షిలో చేరడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే బిగ్‌బాస్‌ గనక ప్రారంభమైతే అందులో సత్తి పాల్గొంటాడా లేదా.. అన్నది సందేహంగా మారింది. కానీ అందుకు సాక్షి మాత్రం అడ్డు కాబోదని తెలుస్తోంది. బిగ్‌బాస్‌లో సత్తి పాల్గొనే అవకాశం ఉంటే సాక్షి అతనికి అందుకు అనుమతి ఇస్తుండవచ్చని సమాచారం. ఇక ఈ విషయంపై మరిన్ని వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది. ఏది ఏమైనా.. సత్తి మరో చానల్‌లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమడం అతని ఫ్యాన్స్‌కు ఉత్సాహాన్నిస్తోంది..!

Read more RELATED
Recommended to you

Latest news