గత కొంతకాలంగా దగ్గుబాటి కుటుంబం పార్టీ మారే అవకాశాలున్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ, వైసీపీ విషయంలో సీరియస్ గా ఉన్న దగ్గుబాటి కుటుంబం ఇప్పుడు పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా ప్రచారం మొదలైంది. అయితే ఇప్పుడు వైసీపీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా పార్టీ మారడానికి సిద్ధమయ్యారు అనే వార్తలు వినిపించాయి.
ఈ నేపథ్యంలోనే చీరాల నియోజకవర్గ ఇన్చార్జిగా ఆయనకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన భార్య ఇద్దరు కూడా పార్టీ మారకుండా ఉండేందుకు బీజేపీ అధిష్టానం చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. తెలుగుదేశం పార్టీ లోకి వెళ్ళకుండా దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా బీజేపీ లోకి రావాలని భారతీయ జనతా పార్టీ అధిష్టానం కోరుతోంది.
ఆయనకు ఒంగోలు ఎంపీ సీట్ కూడా భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఖరారు చేసే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఒంగోలు పార్లమెంట్ నుంచి 2024 ఎన్నికల్లో కచ్చితంగా మీకు సీటు ఇస్తామని బిజెపి తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే మాత్రం ఈ సీటు ఖరారు చేస్తామని హామీ ఇస్తున్నట్లు సమాచారం. వైసీపీలో మీకు ఎలాగూ ప్రాధాన్యత లేదు కాబట్టి మీరు గనక పార్టీ మారితే మీకు ఎటువంటి అన్యాయం కూడా జరగదు అనే అంశాన్ని బీజేపీ అగ్రనేతలు చెబుతున్నారట. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాజ్యసభ ఎంపీ టిజి వెంకటేష్ ఆయనతో ఇటీవల సమావేశం కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది.