బీజేపీలో మరో కాంగ్రెస్ నేత ?… అమిత్ షాతో అమరీందర్ భేటీ

-

కాంగ్రెస్ మరో కీలక నేతను కోల్పోబోతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. పంజాబ్ కీలక కాంగ్రెస్ నేత మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరబోతున్నారనే పుకార్లు గత కొంత కాలంగా షికారు చేస్తున్నాయి. తాజాగా ఈరోజు కెప్టెన్ అమరీందర్ సింగ్ అమిత్ షాతో గంట పాటు ఢిల్లీలో సమావేశమయ్యారు. దీంతో బీజేపీలో చేరడం ఇక లాంఛనమే అనే మాటలు వినిపిస్తున్నాయి. బహుశా పార్టీలో చేరితే ఎటువంటి ప్రాధాన్యం ఉంటుందనే విషయంపై చర్చ జరగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే కెప్టెన్ ఇక కాషాయం కండువా కప్పుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు పంజాబ్ కాంగ్రెస్ లో సస్పెన్స్ ఇంకా కోనసాగుతోంది. అమరీందర్ సింగ్ అవమాన రీతిలో రాజీనాామా చేయించిన తర్వాత పంజాబ్ లో కాంగ్రెస్ పరిస్థితి పెనం నుంచి పొయిలోకి పడిన చందంగా మారింది. సీఎంను మారిస్తే సిద్ధూను సంతోషపరచవచ్చని అనుకున్న కాంగ్రెస్కు మరిన్నిఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పలువురు మంత్రులు, అధిష్టానం ఎంతగా బుజ్జగించినా పీసీసీకి చేసిన రాజీనామాపై సిద్ధూ వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. అన్ని పరిణామాలు కలిసి మరో కీలక నేత కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news