కడియం శ్రీహరి చేసినంత మోసం ఎవరూ చేయలేదు: కేటీఆర్

-

కడియం శ్రీహరి పై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ను కడియం శ్రీహరి మోసం చేసినంతంగా ఎవరూ చేయలేదని కేటీఆర్ అన్నారు. ‘ఇన్నేళ్లలో కేసీఆర్ను చాలా మంది మోసం చేశారు. కానీ కడియం శ్రీహరి చేసింది నయ వంచన అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తన కూతురికి ఎంపీ టికెట్ తీసుకుని మధ్యాహ్నం కేసీఆర్తో భోజనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ రోజు సాయంత్రానికి పార్టీ మారారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నమ్మించి గొంతు కోయడమే’ అని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉంటే… బీజేపీలో చేరుతారనే ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్ స్పందించడం లేదని కేటీఆర్ విమర్శించారు. ‘ఓటుకు నోటు కేసులో కేంద్రం విచారణ చేయొచ్చని రేవంత్ భయం. సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, చేవెళ్ల, అదిలాబాద్ లాంటి స్థానాల్లో బీజేపి ఎంపీ అభ్యర్థులు గెలిచేలా రేవంత్ చర్యలు కనిపిస్తున్నాయి. ఎలాగో బీజేపీలో చేరుతాను కాబట్టి.. నలుగురు బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించుకుందాం అనే ఆలోచనలో రేవంత్ ఉన్నట్లున్నారు’ అని కేటీఆర్ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news