Adipurush Movie : ప్రభాస్​ ‘ఆదిపురుష్​’పై బీజేపీ ఫైర్

-

పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్‌ కథానాయకుడిగా ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఇతిహాసగాథ ‘ఆదిపురుష్‌’. రామాయణం ఆధారంగా తీస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నారు. కృతిసనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా కనిపించనున్నారు. సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటించారు. ప్రముఖ బాలీవుడ్ నటి హేమ మాలిని కూడా ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను అయోధ్యలో విడుదల చేసింది చిత్రబృందం. అయితే ఈ టీజర్ పై ఇప్పటికే మీమ్స్, ట్రోల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఆదిపురుష్ టీమ్ పై బీజేపీ ఫైర్ అవుతోంది. చరిత్రను, పురాణాలను ఇష్టమొచ్చిన రీతిలో చూపిస్తారా అంటూ బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.

‘బహుశా డైరెక్టర్​ ఓం రౌత్​.. వాల్మీకి రామాయణం, తులసీదాసు రామాయణంలో రావణుడి పాత్ర ఎలా ఉంటుందో అధ్యయనం చేయలేదనుకుంటాను. కనీసం తెలుగు, తమిళంలో ఇదివరకు తెరకెక్కిన పౌరాణిక సినిమాల్లో రావణుడి పాత్ర ఎలా ఉందో పరిశీలించాల్సింది. టీజర్​లో రావణుడు నీలి కళ్లతో లెదర్​ జాకెట్​ వేసికున్నట్లు చూపించారు. స్వేచ్ఛా ముసుగులో చరిత్రను వక్రీకరించకూడదు. రామాయణం మన దేశ ప్రజల నాగరికతను కాపాడుతుంది. అలాంటి రామాయణాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కిస్తున్న సినిమాలో రావణుడి పాత్రను వక్రీకరించినందుకు చాలా బాధగా ఉంది. ”

– మాళవిక అవినాశ్​, బీజేపీ అధికార ప్రతినిధి

Read more RELATED
Recommended to you

Latest news