బీజేపీ ప్రజల హక్కులను కాలరాయాలని చూస్తోంది : ప్రియాంక గాంధీ

-

బీజేపీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని, ప్రజల హక్కులను కాలరాయాలని చూస్తోందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మండిపడ్డారు.

ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రియాంకా గాంధీ…బీజేపీ నేతలు ప్రతి చోటా తమకు 400 సీట్లు వస్తాయని అంటున్నారు. అదే జరిగితే రాజ్యాంగాన్ని మార్చేస్తారనే ఆందోళన కలుగుతోంది అని ఆవేదన వ్యక్తం చేసింది.భారత అత్యున్నంత రాజ్యాంగం కోసం దేశంలోని చాలామంది గొప్పవారు తమ జీవితాలను అంకితం చేశారు అని గుర్తు చేశారు.రాజ్యాంగం మహిళలకు సమానత్వ హక్కు, ఆదీవాసులకు నీటి సౌకర్యం, అటవీ హక్కులను అందించింది అని తెలిపారు. రాజ్యాంగం ఓటు హక్కును, రిజర్వేషన్లను, గిరిజన సంస్కృతికి రక్షణ కల్పించింది. అలాంటి రాజ్యాంగాన్ని కేవలం అధికారం కోసం బీజేపీ పార్టీ మార్చాలని, ప్రజల హక్కులను కాలరాయాలని చూస్తోంది అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news