హుజూరాబాద్ లో రౌండ్ రౌండ్ కు బీజేపీ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన అధిక్యతను పెంచుకుంటూ పోతోంది. గ్రామాలు, మున్సిపాలిటీలు అని తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో బీజేపి అభ్యర్థి ఈటెల రాజేందర్ కే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. గత రెండు రౌండ్ లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఓట్లు లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్ మినహా… మిగిలిన అన్ని రౌండ్లలో బీజేపీకే లీడ్ వస్తోంది.
ఇక తాజాగా ఐదో రౌండ్ లోనూ ఈటల రాజేందర్ కు భారీ లీడ్ లభించింది. ఐదో రౌండ్ లో ఈటల రాజేందర్ కు 4358 ఓట్లు పోల్ కాగా… గెళ్లు శ్రీనివాస్ యాదవ్ కు 4014 ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో బీజేపీ పార్టీకి 344 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్లయితే… 5 రౌండ్ల తరువాత బీజేపీకి 2,169 ఓట్ల ఆధిక్యం లభించింది. కాగా… హుజూరాబాద్ బైపోల్ లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగరవేస్తున్నాం అని స్పష్టం చేశారు.