BREAKING : తెలంగాణకు రానున్న బీజేపీ నేత బీఎల్ సంతోష్

-

తెలంగాణ వ్యాప్తంగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశం దుమారం రేగుతోంది. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీలు తప్పు మీదంటే మీదేనంటూ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.  అయితే, ఈ నేపథ్యంలో ఈ కేసులో కీలక సూత్ర దారి అయిన, బిజెపి కీలక నేత బిఎల్ సంతోష్ తెలంగాణకు రానున్నారు.

ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రంలోనే ఉండనున్నారు. దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ విస్తారక్ ల శిక్షణ తరగతులకు హైదరాబాద్ వేదికకానుంది. ఈ శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై పలు అంశాలను నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. కాగా, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్, బిఎల్ సంతోష్ పేరును చేర్చిన నేపథ్యంలో ఆయన పర్యటన రాజకీయంగా హీట్ పెంచనుంది.

Read more RELATED
Recommended to you

Latest news