వరి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర బీజేపీ నాయకులు వితండ వైఖరి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీజేపీ నాయకులపై ఎమ్మెల్సీ కవిత.. తన అధికారిక ట్విట్టర్ ద్వారా విమర్శలు కురిపించారు. వరి ధాన్యం కొనుగోలు అంశంలో రాష్ట్ర బీజేపీ నాయకలు వైఖరి చూస్తుంటే.. వీళ్లు తెలంగాణ రాష్ట్ర బిడ్డలేనా.. అనే అనుమానం వస్తుందని విమర్శించారు. వరి ధాన్యం కొనుగోలు దేశ వ్యాప్తంగా ఒకే విధంగా ఉండాలని రైతుల తరపున సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారని అన్నారు.
సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో ఇదే స్పష్టంగా ఉందని అన్నారు. పంజాబ్, హర్యాణా రాష్ట్రాల్లో ఏ విధంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారో… తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధంగా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
పంజాబ్, హర్యాణాల కు ఒక న్యాయం.. తెలంగాణ రాష్ట్రానికి ఒక న్యాయమా.. అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పంజాబ్ లో కేంద్ర ప్రభుత్వం 100 శాతం వరి ధాన్యం కొనుగోలు చేస్తుందని అన్నారు. పంజాబ్ లో కొనుగోలు చేసినట్టే.. తెలంగాణ రాష్ట్రంలోనూ 100 శాతం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదు. కేంద్రం పంజాబ్లో వడ్లు 100%
కొనుగోలు చేసినట్టే, తెలంగాణలోనూ కొనుగోలు చేయాలి..
We Demand One Nation One Procurement Policy.#KCRWithFarmers#RaithuBandhuKCR— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 22, 2022