వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుటుంబ నేపథ్యాన్ని కించ పరిచేలా బీజేపీ లీడర్ దిలీప్ ఘోష్ వ్యాఖ్యలు చేసినట్లు ఒక వీడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది.దాంతో అది తీవ్ర దుమారం రేపుతోంది. ఘోష్ తీరును ఖండించిన టీఎంసీ వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
బెంగాల్‌కు స్థానిక వ్యక్తే కావాలంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నినాదాన్ని ఎద్దేవా చేస్తూ.. ‘గోవాకు వెళ్లినప్పుడు నేను గోవా బిడ్డను అని,త్రిపురలో ఉన్నప్పుడు త్రిపుర పుత్రికను అంటారు అని ఎద్దేవ చేశారు. మొదట దీనిపై ఆమె స్పష్టత ఇవ్వాలి..’ అంటూ దిలీప్ ఘోష్ అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. దీనిపై తృణమూల్ నేతలు మండిపడుతున్నారు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆ రాష్ట్ర శిశుసంక్షేమశాఖ మంత్రి శశిపంజా డిమాండ్ చేశారు. బెంగాల్ మహిళలపై ఘోష్‌కు గౌరవం లేదు’ అని ఆ పార్టీ మండిపడింది.ఈ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అలాగే ఆయన మాట్లాడిన వీడియో క్లిప్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది
.