దుబ్బాకలో ముందు నుండి చెబుతున్నట్లు బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. దుబ్బాక ఎన్నికల ఫలితాల్లో రెండో రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. రెండో రౌండ్ ముగిసే సరికి మొత్తం 620 ఓట్ల ఆధిక్యత లో బీజేపీ ఉంది. రెండు రోజులు పూర్తయ్యే సరికి దుబ్బాక అభ్యర్థి రఘునందన్ రావు మొత్తం 620 ఓట్ల ఆధిక్యతతో ముందుకు దూసుకు పోతున్నారు. దీంతో ఇక వార్ వన్ సైడే అయినట్ట బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.
రెండో రౌండ్లో రఘునందన్ రావు 279 ఓట్ల ఆధిక్యత కనబరిచారు. రెండో రౌండ్ లో బిజెపికి 1561 ఓట్లు రాగా టిఆర్ఎస్ కేవలం 1282 ఓట్లకు మాత్రమే పరిమితం అయింది. అయితే ఇంకా మరో రెండు టేబుల్స్ కౌంట్ చేయాల్సి ఉంది. బీజేపీ మొదటి రెండు రోజులు ఆగితే కనిపించడంతో బీజేపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాల్లో వెల్లి విరుస్తున్నాయి. ఇందే ట్రెండ్ కొనసాగితే ఇక దుబ్బాకలో తమ జెండా పాతడం ఖాయంగా కనిపిస్తోంది.