ఏపీ కాపులపై బిజేపి ఎంపీ జీవిఎల్ సంచలన వ్యాఖ్యలు

విభజన హామీల అమలు, ప్రాజెక్టుల పనితీరు పరిశీలన కోసం బీజేపీ ఎంపీ జీవీఎల్ రెండు రోజుల విశాఖ పర్యటన చేశారు. ఏపీకి కేంద్రం విస్తృతంగా నిధులు సమకూర్చిందని.. కేంద్రం ఇచ్చిన ప్రయోజనాలపై గుడ్డ కపుతున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్ లో టీడీపీ, వైసీపీ మాకు సానుకూలంగా ఉన్నాయని.. స్టీల్ ప్లాంట్ , పోలవరం వంటి అంశాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అడిగినట్టు ఎక్కడా వినలేదని నిప్పులు చెరిగారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే పోలవరం మేమే నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ప్రతీ అభివృద్ధి కేంద్రానిదేనని వెల్లడించారు. ప్రజా గ్రహ సభ తర్వాత టీడీపీ,బీజేపీల గుండెల్లో రైళ్లు పరుగెట్టాయన్నారు. భారతీయ జనతాపార్టీది సబ్ కా సత్ సబ్ కా వికాస్ నినాదం అని వెల్లడించారు. కాపులకు న్యాయం జరిగేది బీజేపీతోనేనని.. ఏపీలో కాపు సామాజిక వర్గం రాజకీయంగా నష్టపోయిందని పేర్కొన్నారు. ఏపీ కాపులను కచ్చితంగా ఆదుకుంటామని చెప్పారు.