- ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
హన్మకొండ జనవరి 5 : నిరుపేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో పరకాల, నడికూడ పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 59 మంది కళ్యాణలక్ష్మి, షాధిముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ దేనన్నారు. అన్ని కులమతాలకు గౌరవిస్తూ వారి అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారన్నారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లి ఆ కుటుంబానికి భారం కాకూడదనే కేసీఆర్ కళ్యాణలక్ష్మీ పథకం ప్రవేశపెట్టారని చెప్పారు. త్వరలోనే కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయనున్నట్టు తెలిపారు. కేవలం రాజాకీయ లబ్ధికోసం కెసిఆర్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తూ,దొంగ దీక్షలు,ధర్నాల పేరుతో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాల్లో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల,నడికూడ మండలాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.