రక్షణ మంత్రికి ‘‘బిపిన్ రావత్ హెలికాప్టర్ క్రాష్’’ నివేదిక… రిపోర్ట్ లో వెల్లడియిన కీలక విషయాలు

-

బిపిన్ రావత్ హెలికాప్టర్ క్రాష్ కు సంబంధించిన నివేదికను రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు అందించారు. డిసెంబర్ 8న తమిళనాడులోని కూనూర్ సమీపంలో ఆర్మీ హెలికాప్టర్ Mi-17 కుప్పకూలింది. ఈ ఘటనలో దేశ తొలి సీడీఎస్ బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి మధులిక రావత్ తో కలపి మొత్తం 14 మంది మరణించారు. దీంతో ప్రమాదానికి కారణాలు వెతికేందుకు త్రివిధ దళాల సంయుక్త కమిటీ ఏర్పాటు అయింది. తాజాగా ఈ కమిటీ రిపోర్ట్ ను రక్షణ మంత్రికి అందించింది.

హెలికాప్టర్ క్రాష్ పూర్తిగా ప్రమాదమేనని రిపోర్ట్ తెలిపింది. ఏయిర్ మార్షల్ మన్విందర్ సింగ్ తో కూడిన ట్రై సర్వీస్ కమిటీ విచారణ చేసింది. ఘటన సమయంలో ప్రత్యక్ష సాక్షులు, బ్లాక్ బాక్స్ ను విశ్లేషించిన తర్వాత కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. కూనూర్ సమీపంలో దట్టమైన మేఘాల్లోకి హెలికాప్టర్ వెళ్లిందని.. ఒక్కసారిగా దారి కనిపించకపోవడంతో పైలెట్ ఇబ్బందులు ఎదుర్కొన్నారని, మార్గం కోసం రైల్వే లైన్ ను అనుసరించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు నివేదికల ఇచ్చినట్లు సమాచారం. అయితే దట్టమైన మేఘాల్లో చిక్కుకున్న హెలికాప్టర్.. నేల కనిపించకపోవడంతో కిందికి దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓ కొొండ అంచును ఢికొని ప్రమాదానికి గురి అయినట్లు రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news