ఏపీలో బీజేపీ ప్యూహం ఫలిస్తుందా !

-

ఏపీలో బీజేపీ స్పీడ్ పెంచింది. ఇన్నిరోజులు నిరసన కార్యక్రమాలతో సరిపెట్టిన కమల దళం…ఇప్పుడు రాష్ట్రవ్యాప్త పర్యటనకు రెడీ అయ్యింది. వ‌చ్చే నెల 4 నుంచి రథయాత్ర చేపట్టనుంది. దేవాలయాలపై దాడులు, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆరోపణలు, తిరుపతి ఉపఎన్నికపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు కాషాయం పార్టీ నేతలు. ప్రతి జిల్లాని టచ్ చేసేలా రాష్ట్ర పర్యటనకి సిద్దమయ్యారు. అయితే ఇది తిరుపతి ఎన్నికల వ్యూహమా..తామే ప్రత్యాయ్నం అని చెప్పే ప్రయత్నమా అన్న దానిపై ఏపీ రాజకీయాల్లో చర్చ నడుస్తుంది.

బీజేపీ యాత్ర వెనుక పక్కా ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. అంత‌ర్వేది ఘ‌ట‌న‌లో బీజేపీ విశ్వరూపం ప్రద‌ర్శించింది. అంతర్వేది వరకూ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఐతే కరోనా కారణంగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఐనా బీజేపీ కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు. భారీకేడ్లను దాటుకొని వెళ్లారు. బీజేపీ నేతలు ప్రభుత్వంపై ఆరోపణలు సంధించారు. దాంతో అధికార పార్టీ సీబీఐ విచారణకు కోరింది. తాము డిమాండ్ చేయడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరిందని కమలం నేతలు చెప్పుకున్నారు.

ఇప్పటి వ‌ర‌కు పాల‌న విష‌యాల్లో ఆంత ఘాటుగా రియాక్ట్ అవ్వని బిజెపి…ఇప్పుడు గేరు మార్చడం వెనుక ప్రత్యేక వ్యూహం క‌నిపిస్తుంది. అమరావ‌తి విష‌యంలో డ‌బుల్ గేమ్ అనే ముద్ర బిజెపికి మైలేజ్ తేక‌పోగా…డిఫెన్స్ లో పెట్టేసింది. దీంతో త‌మ పేటెంట్ గా భావించే హిందూత్వ అంశాన్నే ఎత్తుకుంది. రాష్ట్రంలో జ‌ర‌గుతున్న ప‌ర‌ణామాలు కూడా బిజెపి అటు వేగంగా అడుగులు వెయ్యడానికి దోహదం చేశాయి. దీంతో బిజెపి క‌పిల తీర్థం నుంచి రామ‌తీర్థం వ‌ర‌కు యాత్రకు సిద్దం అయ్యింది.

ఐతే..రామతీర్థం విషయంలో మాత్రం అంతగా పోరాటం చేయలేకపోయింది. కాస్త ఆలస్యంగా రియాక్ట్‌ అయిన బీజేపీ నేతలు రెండు రోజుల పాటు పోరాటం చేసింది. ఈ విషయంలో టీడీపీ తీవ్రంగా స్పందించింది. చంద్రబాబు బోడికొండకు వెళ్లడం, హిందూమతాన్ని వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని చంద్రబాబు కామెంట్లు చేశారు. ఈ ఎపిసొడ్‌లో బీజేపీ కంటే టీడీపీ గట్టిగా పోరాటం చేసిందన్న వాదనలు విన్పించాయి. దాంతో బీజేపీ ఈ ఇష్యూని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి మైలేజ్ పొందాలన్నది వ్యూహం.

సోమువీర్రాజుకు బాధ్యతలు కట్టబెట్టిన తర్వాత కాస్త దూకుడు పెంచింది. అంతర్వేది రథం ఘటన నుంచి మొన్న జరిగిన రామతీర్థం ఇష్యూ వరకూ.. రోడ్డెక్కి ఫైట్ చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడింది. నిరసన కార్యక్రమాలు చేపట్టింది. వైసీపీతో నువ్వానేనా అన్నంత రేంజ్‌లో ఫైట్ చేసింది. ఐనా… అంత బలంగా ప్రజల్లోకి వెళ్లలేకపోయామన్న భావన పార్టీ కార్యకర్తల్లో ఉంది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపడితే ఇటు క్యాడర్‌లోనూ ఉత్సహాన్ని నింపినట్లు అవుతందని పార్టీ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే వారం రోజులపాటు ఈ యాత్రను నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వ ప‌థ‌కాలు, పాల‌న విష‌యంలో ఆచి తేచి విమ‌ర్శలు చేసిన క‌ల‌మ నాథులు..దేవాల‌య‌ల విష‌యంలో మాత్రం తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ప్రభుత్వాన్ని తిట్టే విష‌యంలో ఉన్న క‌ట్లుబాట్లు, స్వీయ ఆంక్షల‌ను సైతం ప‌క్కన పెట్టి..దుమ్ము రేపుతున్నారు. ఏపీ రాజకీయాలు ఇన్నాళ్లు కులం చుట్టే నడిచాయి, నడిపించారు. కాలం మారింది. పార్టీలు మారాయి. ప్రభుత్వాలు మారాయి. ఇప్పుడు విధానాల్లోనూ మార్పులొచ్చాయి. ఇప్పుడు మతం చుట్టూ రాజకీయం నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news