TSPSC పేపర్ లీక్​ను నిరసిస్తూ.. నేడు బీజేపీ నిరుద్యోగ మార్చ్

-

TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రతిపక్షాలు ఇప్పటికీ నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యంపై నిరంతరం ఎండగడుతూనే ఉన్నాయి. అయితే బీజేపీ ఈ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ ఇవాళ వరంగ్​లో నిరుద్యోగ మార్చ్​కు పిలుపునిచ్చింది.

నేడు ఉమ్మడి వరంగల్‌ జిల్లా కేంద్రంగా కాకతీయ విశ్వవిద్యాలయం కూడలి నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు వేలాదిమందితో నిరుద్యోగ మార్చ్ చేపట్టనుంది. నిరుద్యోగ మార్చ్‌ కోసం కాషాయ శ్రేణులు వరంగల్‌కి తరలివస్తున్నారు. ఆ మార్చ్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు… రాష్ట్ర నాయకత్వం అంతా పాల్గొననుంది. మార్చ్‌ సందర్భంగా ఉద్యోగ నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ నేతలు అల్టిమేటం జారీ చేయనున్నారు. ఉస్మానియా, కాకతీయ యూనినర్సిటీల జేఏసీ.. నిరుద్యోగ మార్చ్‌కి సంఘీభావం ప్రకటించాయి.

పేపర్‌ లీకేజీ వ్యవహారానికి సంబంధించి సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని, కేటీఆర్​ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని, నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష చొప్పున పరిహారంగా ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news