రాజేందర్-రాములమ్మని వదలితే బెటర్!

-

మొన్నటివరకు తెలంగాణలో బీజేపీ దూకుడు కొనసాగిన విషయం తెలిసిందే..అధికార టీఆర్ఎస్ లక్ష్యంగా కమలం పార్టీ దూకుడుగా రాజకీయం చేసి..ప్రజా మధ్దతు పెంచుకునే కార్యక్రమాలు చేసింది..కానీ ఎప్పుడైతే కేసీఆర్ రివర్స్ అయ్యి.. బీజేపీపై ఎటాక్ చేయడం మొదలుపెట్టారో..అప్పటినుంచి సీన్ మారిపోయింది..బీజేపీ చేస్తున్న పోరాటాలు కంటే.. కేసీఆర్, బీజేపీని టార్గెట్ చేసే అంశం బాగా హైలైట్ అవుతుంది..పైగా ఆయన జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానని చెబుతున్నారు. అలాగే దేశాన్ని తెలంగాణ మాదిరిగా అభివృద్ధి చేస్తానని చెప్పుకుంటూ వస్తున్నారు.

ఇక బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలని ఏకం చేసే పనిలో ఉన్నారు..కేసీఆర్ ఈ విధంగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేయడంతో..తెలంగాణలో బీజేపీ చేసే కార్యక్రమాలు హైలైట్ అవ్వడం లేదు..పైగా కేసీఆర్ రాజకీయం వల్ల బీజేపీకే మైనస్ అయ్యే పరిస్తితి ఉంది. ఇది ఇలాగే కొనసాగితే బీజేపీకే నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి..అందుకే తెలంగాణలో బీజేపీ వ్యూహాలు మార్చుకోవాలి.

ఏదో కేసీఆర్ విమర్శలు చేస్తే కౌంటర్లు ఇవ్వడమే కాకుండా క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ బలాన్ని తగ్గిస్తూ రావాలి..అలాగే కేసీఆర్ రాజకీయం ఎలా ఉంటుందో ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పాలి. అలా చేయాలంటే బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్, విజయశాంతి లాంటి వారిని ముందు పెట్టి రాజకీయం చేయాలి. ఎందుకంటే ఈటల, విజయశాంతిలకు కేసీఆర్ గురించి బాగా తెలుసు..వీరిద్దరికి తెలిసినట్లుగా మరొకరికి కేసీఆర్ నిజస్వరూపం ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే వారే కేసీఆర్ రాజకీయాన్ని బాగా దగ్గరుండి చూశారు.

అలాగే తనకు రాజకీయంగా ఇబ్బంది వస్తుందని చెప్పి..ఈటల, విజయశాంతిలని కేసీఆర్ ఎలా పార్టీలో నుంచి సైడ్ చేశారో అందరికీ తెలిసిందే. అయితే ఈ పరిణామాలని ఈటల, విజయశాంతిలే ప్రజలకు చెప్పాలి..అసలు అవసరానికి తగ్గట్టు కేసీఆర్ ఏ విధంగా రాజకీయం చేస్తారో..బహిరంగ సభలు పెట్టి ప్రజలకు వివరించాలి..అలా కాకుండా మీడియా ముందు బండి సంజయ్ లాంటి వారు కౌంటర్లు ఇచ్చిన అవి పెద్దగా చేరువ కావు..కాబట్టి రాజేందర్, రాములమ్మని ముందు పెట్టి రాజకీయం చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news