సొంత ఇల్లు హోదాని పెంచుతుంది

-

  • ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు

అంపోలు (శ్రీ‌కాకుళం) : సొంత ఇల్లు అనేది సమాజంలో హోదాని పెంచుతుంద‌ని.. ఆ హోదా ద‌క్కేందుకు అవ‌కాశం కల్పించిన సీఎం జగన్ కి లబ్ధిదారులందరూ రుణపడి ఉండాలని శ్రీకాకుళం శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. గృహ నిర్మాణ శాఖ‌ మంత్రి చెర‌కువాడ శ్రీరంగనాథ రాజు శుక్ర‌వారం జిల్లా ప‌ర్య‌ట‌న‌కు విచ్చేశారు. ఇందులో భాగంగా జగనన్న కాల‌నీ
(అంపోలు-లింగాలవలస అర్బన్ లే – అవుట్) లో లబ్ధిదారులతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే ధ‌ర్మాన మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్ర‌తీపేద కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాల‌న్న‌దే త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు.ఇళ్ల విష‌యంలో త‌ప్పుడు ప్ర‌చారాల‌ను చేస్తూ, ప్ర‌జ‌ల్లో అపోహ‌లు సృష్టించొద్ద‌ని హిత‌వు పలికారు. కాల‌నీల నిర్మాణం వల్లన స్థానిక గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తునున్నాయని,వాటిని పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపడ తామని తెలిపారు.

ప్రభుత్వ అవసరాలకు సరిపడిన భూమి పట్టణంలో లేదని, అందువల్ల పట్టణానికి ఆనుకొని ఉన్న నివాస యోగ్య ప్రాంతాలను గుర్తించి,లే ఔట్లు వేసి ఇచ్చామ‌న్నారు. ఇక్క‌డ మౌలిక వసతుల కల్పన కోసం అధిక మొత్తం కేటాయించామ ని తెలిపారు. కాగా సొంత స్థలం కలిగి ఇళ్లు కట్టు కోవాలని ఉన్న పేదలకు రుణాలు ఇవ్వనున్నామని అన్నారు.

కార్య‌క్ర‌మంలో డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ‌దాసు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఎం. వి. పద్మావతి, రాష్ట్ర కళింగకోమటి కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ చైర్మన్లు అంధవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ డి. దొరబాబు, సంయుక్త కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు, నవరత్నాల ఎగిక్యూటివ్ వైస్ చైర్మన్ నారాయణ మూర్తి, హౌసింగ్ బోర్డు చైర్ పర్సన్ లత, గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్. గణపతి, ట్రాన్స్ కో పర్యవేక్షక ఇంజినీర్ మహేంద్రనాథ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్ వి.రవికుమార్, మండల ప్రత్యేక అధికారులు, ప‌లువురు రెవెన్యూ అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news