రైతు బంధును కాపీ కొట్టే బీజేపీ పీఎం కిసాన్ పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీలో రైతు భరోసా పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. నీరు పల్లమెరుగు.. నిజం దేవుడెరుగు అంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. కాళేశ్వరం అంటే మూడు బ్యారేజ్ లు అన్నారు. రైతు బంధు పథకాన్ని పశ్చిమ బెంగాల్ లో కృషి బంధు, ఒడిశాలో రైతు బంధు ను ఆదర్శంగా తీసుకొనే రైతుల కోసం పథకం పెట్టారు.
అలాగే ఐక్యరాజ్యసమితి, పలు ఆర్థిక సంస్థలు, ఆర్థిక వేత్తలు రైతు బంధు పథకాన్ని ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోడీ రైతు బంధును కాపీ కొట్టే పీఎం కిసాన్ పెట్టారు. కానీ తెలంగాణ లో మాదిరిగా కాకుండా కోత విధించారని తెలిపారు. రైతు బంధు పథకం రాక ముందు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతు ఆత్మహత్యలతో సతమతమయ్యేదని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో గణనీయంగా తగ్గాయని తెలిపారు. మొత్తం ఆత్మహత్యల్లో 11.1 శాతం తెలంగాణ రాష్ట్రానివే.. మా పాలన ముగిసే నాటికి వాటిని 1.5 శాతానికి తగ్గించామని తెలిపారు.