సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసులో పోలీసు అధికారులను బిజెపి రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి ప్రశ్నించారు. సుశాంత్ సింగ్ మృతదేహం కూడా లేనప్పుడు, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ది హత్య లేదా ఆత్మహత్య అనేది ఎలా చెప్తారు అని ప్రశ్నించారు. అసలు హత్యా లేదా ఆత్మహత్య అనేది ఎయిమ్స్ పోస్ట్ మార్టం నిర్ణయిస్తుందని పోలీసు అధికారులు మీడియాకు ఎలా చెప్తారని ఆయన నిలదీశారు.
స్వామి… సుశాంత్ కేసును సునంద పుష్కర్ మరణ కేసుతో పోల్చారు. సునంద కేసు మాదిరిగానే, మృతదేహం లేకుండానే హత్య లేదా ఆత్మహత్య జరిగిందా అని ప్రకటించలేమని ఆయన అన్నారు. డాక్టర్ కూపర్ హాస్పిటల్ వైద్యులు నివేదికలను పరిశీలిస్తే అసలు వాస్తవం బయటకు వస్తుందని ఆయన అన్నారు. ఈ ట్వీట్‌ను సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి కూడా షేర్ చేసారు.