బ్రేకింగ్ : సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్ కు చుక్కెదురు

-

ఏపీ సర్కార్ కు సుప్రీం కోర్టులో ఇంగ్లీష్ మీడియం అమలు మీద చుక్కెదురు అయింది. ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలు పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన 81, 85 జీవోలను హైకోర్టు కొట్టివేయడం సరికాదని సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. ఏప్రిల్ 15 న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ జూన్ 4న సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఈ కేసు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ కెఎం జోసెఫ్ లతో కూడిన ధర్మాసనం ముందు నేడు విచారణ జరిగింది.

jagan mask
jagan mask

రాష్ట్రంలో 80 శాతానికి పైగా విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం విద్యను కోరుతున్నారని పిటిషన్ లో ప్రభుత్వం పేర్కొంది. పేద విద్యార్థులకు లబ్ధి చేకూర్చేందుకు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇంగ్లీష్ మీడియంపై జీవోలు తీసుకొచ్చామని కూడా పిటిషన్ లో పేర్కొంది. ఏపీలో ఇంగ్లీష్ మీడియం విద్య అమలుకోసం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ప్రభుత్వం కోరింది. అయితే సుప్రీం కోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన సుప్రీం కోర్టు, తదుపరి విచారణ సెప్టెంబర్ 25కు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news