ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా కట్టడికి క్కడి చర్యలు ఫలితం పెద్దగా ఇవ్వడం లేదు. తాజాగా ములుగు జిల్లాలో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. వెంకటాపురం మండలం వీఆర్కే పురంలో ఊరంతా కరోనా సోకింది. ఆ ఊరి కొంప ముంచాయి దినకర్మ సహపంక్తి భోజనాలు. సహపంక్తి భోజనాలు చేసిన సగం మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని అధికారులు మీడియాకు వివరించారు.
గ్రామ పంచాయతీలో 500 జనాభా ఉంటే 100 కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా ఉగ్ర రూపంతో హోం ఐసోలేషన్ కు పరిమితమైన గ్రామస్తులు… ఇళ్ళ నుంచి బయటకు రావడం లేదు. కరోనా కేసులు ఎక్కువగా రావడంతో గ్రామ రహదారులు దిగ్బంధం చేసిన అధికారులు… గ్రామాల్లోకి ఎవరిని రానీయకుండా చర్యలు చేపట్టారు.