ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలపై స్టింగ్ ఆపరేషన్ వీడియోని విడుదల చేసిన బిజెపి

-

ఢిల్లీ లో లిక్కర్ పాలసీ అవినీతిపై సుశాంషు త్రివేది, అదేష్ గుప్త బీజేపి అధికార ప్రతినిదులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలపై స్టింగ్ ఆరేషన్ వీడియోని విడుదల చేసారు బీజేపి నేతలు. స్టింగ్ ఆరేషన్ వీడియోలో ఢిల్లీ లో లిక్కర్ హోల్ సేల్ పంపిణీ చేసిన అతను అమిత్ అరోడా ఆ వీడియోలో మాట్లాడిన వివరాలు ఉన్నాయి. ఆ వీడియోలో లిక్కర్ స్కాంలో ఉన్న వారి పేర్లను చెప్పారు అమిత్ అరొడా.

ఎవరి ఎవరికి ఎంత ఇచ్చారో, ఎంత మొత్తం మీద డబ్బులు చేతులు మారయో చెప్పాడు. ఈ వీడియోని విడుదల చేసిన అనంతరం బిజెపి నేతలు మాట్లాడుతూ.. “గుజరాత్ కి అమ్ముతున్న లిక్కర్ ఢిల్లీ నుంచి పోతున్నదని, పంజాబ్ లో అమ్ముతున్న లిక్కర్ కూడా ఢిల్లీలో నుంచి పోయింది. ఢిల్లీలో ఒబేరాయివ్ హోటల్, కూర్చుని ఈ లిక్కర్ పాలసీ తయారు చేశారు. అరుణ్ పిలై, జస్ దీప కౌరు చెడ్డా, సమీరా మహేంద్ర, అమండల్ ఇంకా కొంత కలిసి ఈ పాలసీ తయారు చేశారు.

ఎల్ వన్ తో ఒప్పందం కుదుర్చకున్నారు. కావాలని కొంత మందికి లాభం చేకూర్చలే ఈ పాలసీ చేశారు. బ్లాక్ మనీ నీ వైట్ మనీ చెయడం కోసం కొంత మంది పెద్దలు ఈ పాలసీలో పెట్టుబడులు పెట్టారు. వేల కోట్ల నష్టం ఈ పాలసీ వల్ల జరిగింది. ఈ స్టింగ్ అపరేషన్ విడియోలో ఉన్నది లిక్కర్ స్కాం లో 9 వ నిందితుడు. ఢిల్లీలో అక్రమంగా లిక్కర్ ద్వారా వచ్చిన డబ్బులను అప్ పంజాబ్, గోవా ఎన్నికలలో ఖర్చు పెట్టారు. ఢిల్లీలో ప్రతి వైన్ షాపు దగ్గర నుంచి 5 కొట్లు తీసుకున్నారు. అవినీతిని అంతం చేస్తా అని కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చారు…కానీ ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహారిస్తున్నారు.

ఢిల్లీలో ఎంత లిక్కర్ అవసరమో అంత కాకుండా అంతకు మించి సప్లయ్ చేశారు. బ్లాక్ దందా అంతా ఢిల్లీనుంచి సప్లయ్ అయ్యింది… దేశంలో వివిధ రాష్ట్రాలకి సప్లయ్ అయ్యింది. కేజ్రీవాల్ ఆయన మిత్రులకు లాభం చేకూర్చాడు.ఈ స్టింగ్ ఆపరేషన్ లో అన్ని విషయాలు బయట పడ్డాయి. ముఖ్యమంత్రి పదవికికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చెయ్యాలి..ఆయన ముఖ్యమంత్రి సీట్లు కూర్చోవడానికి అనర్హుడు. ఆయన బిజెపిపై చేసిన విమర్శలకు క్షమాపణ చెప్పాలి.” అని డిమాండ్ చేశారు బిజెపి నాయకులు.

Read more RELATED
Recommended to you

Latest news