ఫ్యాక్ట్ చెక్: చిల్డ్రన్ హెల్ప్ లైన్ నెంబర్ లో మార్పులు చేసారా..? అసలేం అయ్యింది..?

-

నకిలీ వార్తలు మనకేం కొత్త కాదు. సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు.

వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం.

సోషల్ మీడియా రిపోర్టులను బట్టి చూస్తుంటే చిల్డ్రన్ హెల్ప్ లైన్ 1098 మినిస్టరీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని ERSS హెల్ప్ లైన్ నెంబర్ 112 కింద ఆపరేట్ చేయడం జరుగుతుందని ఉంది. నిజంగా ఇలా మార్చారా లేదంటే ఇది నకిలీ వార్త అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సోషల్ మీడియా రిపోర్టర్ లో వచ్చింది నిజం కాదు ఇది నకిలీ వార్త మాత్రమే. ఇందులో నిజం ఏమీ లేదు.

చిల్డ్రన్ హెల్ప్ లైన్ 1098 మినిస్టరీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి ట్రాన్స్ఫర్ చెయ్యలేదు. ERSS హెల్ప్ లైన్ నెంబర్ 112 కింద ఆపరేట్ చేయడం అనేది నకిలీ వార్త మాత్రమే. ఇది వట్టి ఫేక్ మాత్రమే కనుక నమ్మద్దు.

Read more RELATED
Recommended to you

Latest news