కమలంలో డౌట్లు: ఉన్నది 3…70 కొట్టేది ఎలా?  

-

తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ బలం కేవలం 3 సీట్లే. అవును పార్టీకి ఉన్నది 3 సీట్లే కానీ…నెక్స్ట్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్‌ని మట్టికరిపించి 70 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామని కమలనాథులు చెబుతున్నారు. అంటే 3 సీట్ల నుంచి బీజేపీ సీట్లకు ఎదగగలదా అంటే? ఏమో చెప్పలేం…ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు బీజేపీ ప్రయాణం రెండు సీట్లతోనే మొదలుపెట్టి..ఇప్పుడు కేంద్రంలో 300 సీట్లపైనే బలంతో అధికారంలో ఉంది.

అలాగే వెస్ట్ బెంగాల్‌లో బీజేపీకి 10 సీట్లు వచ్చే బలం కూడా లేదు…కానీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 80 సీట్లపైనే గెలుచుకుని, తృణమూల్ కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చింది. కాబట్టి రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఇప్పుడు తెలంగాణలో 3 సీట్లే ఉండొచ్చు…కానీ రేపటి రోజున 70 సీట్లు గెలుచుని అధికారంలోకి రావొచ్చు. కాబట్టి రాజకీయాల్లో అంచనాలు మారిపోతాయి.

సరే అంచనాలు పక్కనబెడితే..వాస్తవ పరిస్తితులని చూస్తే…బీజేపీకి అంత బలం ఉందా? అంటే ప్రస్తుతానికి లేనట్లే కనిపిస్తోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆ పార్టీ 105 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. కానీ నిదానంగా టీఆర్ఎస్‌పై వ్యతిరేకత, అలాగే బీజేపీలో బలమైన నాయకులు చేరుతూ వస్తుండటంతో పరిస్తితి మారింది. ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌ని ఓడించి బీజేపీ సత్తా చాటింది. కాకపోతే వచ్చే ఎన్నికల్లో కూడా సత్తా చాటాలంటే బీజేపీ ఇంకా బలపడాలి.

వాస్తవానికి చూసుకుంటే బీజేపీకి మెజారిటీ నియోజకవర్గాల్లో బలం లేదు. కాస్త గట్టిగా కష్టపడితే ఒక 50 నియోజకవర్గాల్లో బలమైన నేతలు, కార్యకర్తలు దొరికే అవకాశం ఉంది. అంటే దాదాపు 70 నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన నాయకులు గానీ, క్యాడర్ గానీ దొరికే అవకాశాలు తక్కువ ఉన్నాయి. అలాగే వేలాది పోలింగ్‌ బూత్‌లలో బీజేపీకి క్రియాశీల కార్యకర్తలు లేరు. పోనీ మోదీ ఇమేజ్‌తో ముందుకెళ్లాలంటే ఇవేమీ పార్లమెంట్ ఎన్నికలు కాదు…అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి..బీజేపీ 70 సీట్లు గెలవాలంటే ఎంత కష్టపడాలి..ఎన్ని అద్భుతాలు జరగాలి అనేది ఊహించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news