ఆగస్టు 16 నుండి బీజేపీ జన్ ఆశీర్వాద్ యాత్ర.. 19,500 కిలోమీట‌ర్ల యాత్ర చేయ‌నున్న కొత్త కేంద్ర మంత్రులు..

-

ప్ర‌ధాని నరేంద్ర మోదీ గ‌త నెల‌లో త‌న కేబినెట్‌ను విస్తరించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే కొంద‌రిని మంత్రి ప‌ద‌వుల నుంచి త‌ప్పించారు. కొంద‌రు కొత్త వాళ్ల‌కు అవ‌కాశం ఇచ్చారు. అయితే కొత్త‌గా పద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన మంత్రులు త్వ‌ర‌లోనే దేశ‌వ్యాప్తంగా 19,500 కిలోమీట‌ర్ల మేర యాత్ర చేయ‌నున్నారు. దానికి బీజేపీ అధిష్టానం జ‌న్ ఆశీర్వాద్ యాత్ర‌ ( Jan Ashirwad Yatra )గా నామ‌క‌ర‌ణం చేసింది. ఆగ‌స్టు 16 నుంచి ఆ యాత్ర ప్రారంభం అవుతుంది.

ఆశీర్వాద్ యాత్ర‌ | Jan Ashirwad Yatra
ఆశీర్వాద్ యాత్ర‌ | Jan Ashirwad Yatra

కొత్తగా చేరిన 39 మంది కేంద్ర మంత్రులు ప్రజల ఆశీర్వాదం కోరే లక్ష్యంతో వచ్చే వారం నుంచి జన్ ఆశీర్వాద్ యాత్ర చేపడతారని బిజెపి తెలిపింది. ఈ యాత్ర 212 లోక్ సభ నియోజకవర్గాలు, 265 జిల్లాలతో సహా 13 రాష్ట్రాలలో 19,567 కి.మీ. మేర కొన‌సాగుతోంది. మొత్తం మంత్రులందరూ 142 రోజుల‌లో యాత్ర‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.

బిజెపి జాతీయ కార్యదర్శి తరుణ్ చుగ్ ఈ సంద‌ర్బంగా మాట్లాడుతూ.. త‌మ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పడానికి కొత్తగా నియమించబడిన కేంద్ర మంత్రులు దేశంలోని అన్ని ప్రాంతాలలోనూ యాత్ర‌ను చేప‌డుతార‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ యాత్ర‌ను పూర్తి చేస్తార‌ని తెలిపారు. కాగా ఆగస్టు 19 నుంచి కేంద్ర మంత్రులు యాత్రను ప్రారంభిస్తారు. జూనియర్ మంత్రులు ఆగస్టు 16 నుండి యాత్రను చేపడతారు. ప్రతి యాత్ర కనీసం మూడు రోజులు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది ఏడు రోజులకు పైగా కొన‌సాగుతుంది. ఈ క్ర‌మంలోనే మంత్రులు కనీసం 130 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. మూడు లోక్ సభ నియోజకవర్గాలను కవర్ చేయాలి. కనీసం నాలుగు జిల్లాల‌లో అయినా ప‌ర్య‌టించాలి.

Read more RELATED
Recommended to you

Latest news