ఆ ఐదు నగరాల నుండి దుబాయ్ వెళ్ళవచ్చు… కోవిడ్ నియమాలివే.

-

కోవిడ్ కారణంగా ఇండియా నుండి దుబాయ్ వచ్చే విమానాలపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆ నిషేధాన్ని ప్రస్తుతం ఎత్తివేసింది. ఇండియాలోని ఆగస్టు 7వ తేదీ నుండి చెన్నై, కోచి, బెంగళూరు, త్రివేండ్రం, న్యూఢిల్లీ.. నగరాల నుండీ దుబాయ్ లోని అబుదాబి ప్రయాణం చేయవచ్చు. అలాగే ఆగస్టు 10వ తేదీ నుండి మరో మూడు నగరాలు, హైదరాబాద్, ముంబై, అహమ్మదాబాద్ చేరనున్నాయి. ఇటీవల నిషేధం ఎత్తివేసిన దేశాలలో ఇండియాతో పాటు పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, నైజీరియా, ఉగాండా ఉన్నాయి.

ఐతే ప్రస్తుతం పూర్తి నిషేధాన్ని ఎత్తివేయలేదు. ఈ ప్రకారం ఎవరు పడితే వారు దుబాయ్ కి వెళ్ళడానికి లేదు. దుబాయ్ పౌరులు మాత్రమే ఇండియా నుండి వెళ్ళవచ్చు. ఇంకా రవాణాకి అనుమతులు ఇచ్చింది.

కోవిడ్ నియమాలు

రెండు డోసులు పూర్తయ్యి 14రోజులు దాటిన వారు మాత్రమే దుబాయ్ ప్రయాణం చేయాలి. దీనికోసం GDRFA (General Directorate of Residency and Foreigners Affairs), Dubai, or the ICA (Federal Authority of Identity and Citizenship), UAE లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఒక్కసారి అబుదాబి చేరిన తర్వాత 10రోజుల క్వారంటైన్ పాటించాలి. అలాగే ఎయిర్ పోర్టు అధికారులు ఇచ్చే మెడికల్ బ్యాండ్ ను ధరించాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news