ఇటీవల తమిళనాడు యువ మంత్రి ఉదయనిధి స్టాలిన్ హిందూ సనాతన దర్మం గురించి చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించాయి. దాదాపుగా ఉదయనిధి స్టాలిన్ ను అందరూ కార్నర్ చేసినంత పని చేశారు. కానీ స్టాలిన్ చేసిన కామెంట్స్ పై స్టాండ్ అయ్యాడు… ఇక తాజాగా అమిత్ షా చేసిన వ్యాఖ్యల పట్ల ఉదయనిధి స్టాలిన్ ఆక్షేపణ తెలియచేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అమిత్ షా ఏమన్నారంటే.. దేశం మొత్తాన్ని కూడా హిందీ భాష ఒక్కటే ఏకం చేస్తుందని చెప్పారు. ఈ వ్యాఖ్యలను డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ఖండించారు, కేవలం నాలుగు లేదా అయిదు రాష్ట్రాలలో మాత్రమే హిందీ మాట్లాడితే, మీరు దేశం మొత్తానికి ఎలా ఆపాదిస్తారు. ఇది వినడానికి చాలా విడ్డూరంగా ఉందంటూ ట్విట్టర్ వేదికగా ఉదయనిధి స్టాలిన్ కామెంట్ చేశారు.
తమిళనాడులో మేము అంతా తమిళ్ మాట్లాడుతాము, కేరళలో మలయాళం మాట్లాడుతాము .. మరి ఈ రెండు రాష్ట్రాలను కేరళలో ఎలా కలుపుతుందో చెప్పాలంటూ అమిత్ షా ను ప్రశ్నించారు స్టాలిన్. ఇక ఉదయనిధి చేసిన ఈ పోస్ట్ పై ఇంకెన్ని వివాదాలు చెలరేగుతాయో చూడాలి.