వేములవాడలో బీజేపీ జోరు..బరిలో నిలిచేది ఎవరు ?

-

ఇటీవల వచ్చిన పలు సర్వేల్లో వేములవాడలో ఈ సారి బీజేపీకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని సంగతి తెలిసిందే. దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ రాజ రాజేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ నియోజకవర్గంలో వరుసగా మూడు ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటుతూ వస్తుంది…అది కూడా జర్మనీ పౌరసత్వం ఉన్న చెన్నమనేని రమేష్ గెలుస్తూ వస్తున్నారు. ఇక ఈయన నియోజకవర్గంలో అందుబాటులో ఉండేది తక్కువ..ఇక జర్మనీ పౌరసత్వంపై కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో….దీనికి సంబంధించి కేంద్ర హోమ్ శాఖ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది.

ఈ క్రమంలోనే నెక్స్ట్ చెన్నమనేనికి టీఆర్ఎస్ సీటు దక్కడం కష్టమని తెలుస్తోంది…ఇప్పటికే కేసీఆర్ సైతం…చెన్నమనేనికి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. అలాగే చెన్నమనేనిపై వ్యతిరేకత రావడం టీఆర్ఎస్‌ పార్టీకి బాగా మైనస్ అయింది.

అందుకే ఆయన్ని తప్పించి…కాంగ్రెస్ నుంచి వచ్చిన చల్మెడ లక్ష్మీ నరసింహారావుకు సీటు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అటు మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న కొండ దేవయ్య సైతం సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్ నుంచి ఎవరు బరిలో ఉన్నా ఈ సారి వేములవాడలో గెలవడం కష్టమని తెలుస్తోంది. ఇదే క్రమంలో ఇక్కడ కాంగ్రెస్ బలం కూడా తగ్గుతూ వస్తుంది…కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్ బరిలో దిగనున్నారు.

ఇక ఇక్కడ గెలుపు అవకాశాలు బీజేపీకి మెండుగా ఉన్నాయని సర్వేల్లో తెలుస్తోంది…అయితే ఇక్కడ పోటీ చేసే అభ్యర్ధిపై క్లారిటీ లేదు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్…మళ్ళీ కరీంనగర్ అసెంబ్లీలోనే పోటీ చేస్తారా లేక వేములవాడలో పోటీ చేస్తారో క్లారిటీ లేదు. బండి బరిలో ఉంటే వేములవాడలో బీజేపీ విజయం సులువే. అదే సమయంలో ఈ సీటుపై సీనియర్ నేత సి‌హెచ్ విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ సైతం ఆశిస్తున్నారు. బండి బరిలో దిగకపోతే వికాస్‌కే సీటు దక్కేలా ఉంది…మరి చూడాలి వేములవాడలో బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారో.

Read more RELATED
Recommended to you

Latest news