బ్రేకింగ్: తెనాలిలో బ్లాక్ ఫంగస్… అలెర్ట్ అయిన ఏపీ సర్కార్

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణా ప్రభుత్వం ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి చాలా జాగ్రత్తగా చర్యలు చేపట్టింది. ఇక తాజాగా తెనాలిలో బ్లాక్ ఫంగస్ కలకలం రేగింది. సుల్తానాబాద్ కు చెందిన మహిళకు బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనపడుతున్నాయి. ఫంగస్ సోకడంతో తీవ్ర అనారోగ్యానికి గురైన కౌతవరపు మల్లేశ్వరి ఇటీవల కరోనా బారిన పడ్డారు.

ఇటీవల కరోనా బారిన పడి చికిత్స పొంది మల్లేశ్వరి ఆమె భర్త భద్రయ్య కోలుకున్నారు. రెండు రోజులుగా వ్యాధి లక్షణాలతో తెనాలి, గుంటూరు ఆసుపత్రుల చుట్టూ భార్యాభర్తలు తిరుగుతున్నారు. ఇక్కడ సరైన సౌకర్యాలు మందులు లేవని వైజాగ్ తీసుకెళ్ళమని వైద్యులు సూచించారు. రెండు కళ్ళకు ఫంగస్ చేరి తీవ్ర అనారోగ్యానికి బాధితురాలు మల్లేశ్వరి గురయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news