చాలా మంది ఈ రోజుల్లో రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు చర్మం నల్లగా మారిపోవడం చర్మం పై మొటిమలు వంటివి రావడం ఇలా రకరకాల చర్మ సమస్యలతో బాధ పడుతున్నారు. దీని వలన అందం పాడవుతుంది చర్మం రంగు తగ్గిపోవడం లేదంటే చర్మం పై మొటిమలు వంటివి రావడం వలన అందంగా కనపడలేరు. మహిళలూ మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారా..? అయితే కచ్చితంగా మీరు ఈ చిట్కాలని ట్రై చేయాలి చాలా మంది పెదాల మీద చర్మం నల్లగా మారిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు ఈ టిప్స్ బాగా ఉపయోగపడతాయి. చర్మం మళ్లీ తెల్లగా వస్తుంది.
ఇబ్బందులు ఏమీ ఉండవు. ఆరోగ్యానికే కాదు అందానికి కూడా పసుపు బాగా ఉపయోగపడుతుంది. పసుపుని మీరు పాల తో కానీ పెరుగు తో కానీ చర్మం మీద అప్లై చేస్తే చర్మం తెల్లగా వస్తుంది. నల్లటి చర్మం నుండి బయటపడొచ్చు. మీ పై పెదవి పైన చర్మం నల్లగా మారినట్లయితే కొంచెం పాలని కూడా మీరు డైరెక్ట్ గా అప్లై చేయండి. ఇది కూడా మీ చర్మాన్ని తెల్లగా మారుస్తుంది. లేదంటే మీరు కొంచెం ఓట్ పౌడర్ ని కానీ రోజ్ వాటర్ లేదంటే చందనం పొడిని కానీ ఇలా మిక్స్ చేసి మీరు పై పెద్దవి చర్మం పైన రాశారంటే కచ్చితంగా చర్మం తెల్లగా మారుతుంది.
సమస్య నుండి బయటపడొచ్చు. పెరుగు కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో ఆల్ఫా హైడ్రోక్సి ఉంటుంది. నల్లటి చర్మాన్ని తొలగిస్తుంది. పై పెదవి మీద చర్మం నల్లగా మారినట్లయితే కొంచెం పెరుగు లో రోజ్ వాటర్ ని వేసి మీరు నల్లగా మారిన చర్మం మీద రాస్తే చర్మం తెల్లగా వస్తుంది. కాసేపు ఈ మిశ్రమాన్ని మీ చర్మంపై రాసి తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది. తేనెని కూడా చర్మాని బాగా రిపేర్ చేస్తుంది కొంచెం ఆర్గానిక్ తేనె ని రోజ్ వాటర్ వేసి మీరు పై పెదవి మీద రాశారంటే చర్మం కొద్దిసేపట్లోనే తెల్లగా మారుతుంది. ఇలా చర్మాన్ని రిపేర్ చేసుకోవచ్చు.