మాజీ ఎంపీ పొంగులేటికి కె ఏ పాల్ బంపర్ ఆఫర్ ప్రజాశాంతి పార్టీలో చేరితే డిప్యూటీ సీఎం పదవి

-

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.బీజేపీ, కాంగ్రెస్ లు ఆయనకు గాలం వేసినా ఇంతవరకు ఎవ్వరికి క్లారిటీ ఇవ్వలేదు. బీజేపీ తరపున ఈటల రాజేందర్ బృందం, కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ టీం ఇటీవల ఆయనతో చర్చలు జరిపారు. అయినా.. ఆయన ఏ పార్టీ వైపు మెుగ్గు చూపడం లేదు.


పైగా పార్టీలో చేరే విషయంపై ఇటీవల ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో చేరితే ఆ పార్టీయే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు. అయితే తాను ఏ పార్టీలోకి వెళ్ళాలి అనే విషయంపై మరో 15 రోజుల్లో క్లారిటీ ఇస్తామన్నారు.

ఎన్నికల సమయం వచ్చిందంటే ప్రత్యక్షమై లేనిపోని హడావుడి చేసే కె ఏ పాల్… పొంగులేటికి గాలం వేసే పనిలో పడ్డారు. శ్రీనివాస రెడ్డి కీలక వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించిన పాల్… బంపరాఫర్ ఇచ్చారు. ప్రజాశాంతి పార్టీలో చేరితే అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం పదవి ఇస్తామన్నారు. ఈ ఓపెన్ ఆఫర్ ని స్వీకరించాలని పాల్ కోరారు. అంతేకాదు పొంగులేటితో పాటు బీఆర్ఎస్ పార్టీని వీడిన జూపల్లి కృష్ణారావు, ఈటల రాజేందర్, కొండ విశ్వేశ్వర్ రెడ్డిలను సైతం ఆయన తన పార్టీలోకి ఆహ్వానించారు.వాళ్ళు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే ఒక్కసీటు కూడా గెలవలేరంటూ కామెంట్ చేశారు. ప్రజాశాంతి పార్టీలోకి వస్తే కావాల్సిన పొజిషన్ ఇస్తానని చెప్పారు.

ఖమ్మం జిల్లాలో పొంగులేటి కోరుకున్న 10 స్థానాలు ఆయనకు కావాల్సిన అభ్యర్థులకే ఇస్తానని పాల్ స్పష్టం చేశారు. మరి పాల్ కామెంట్స్ పై పొంగులేటి స్పందిస్తారా లేదా అనేది వేచి సీబుడలి. లేదంటే సొంత పార్టీ ఎన్నికలకు వెళ్తారా అనే దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news