శ్రీకాకుళం జిల్లాలో భారీ పేలుడు..ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు..!

శ్రీకాకుళం జిల్లాలో పేలుడు కలకలం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణంలోని కచేరీ వీధిలోని ఓ ఇంట్లో అక్రమంగా బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. చిన్నారి సాయి మరియు హరి లకు తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉంది. గాయాలపాలైన ఇద్దరు చిన్నారులను వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ మొదలు పెట్టారు. ఇక ఇంట్లో భారీ పేలుడు సంభవించడంతో ఆ వీధి లోని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దాంతో ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. మరెవరైనా ఇంట్లో బాణా సంచా తయారు చేస్తున్నారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.