మహారాష్ట్ర లో పడవ ప్రమాదం..11మంది గల్లంతు..!

మహారాష్ట్ర లో మహా విషాదం చోటు చేసుకుంది. నదిలో పడవ బోల్తా పడడంతో 11మంది గల్లంతయ్యారు. మహారాష్ట్ర లోని అమరావతి జిల్లా గాలేగావ్ సమీపం లో వార్దా నదిలో ఈ విశాద ఘటన చోటు చేసుకుంది. కాగా వీరిలో ఒకే కుటుంబాని

కి చెందిన ముగ్గురు మృత దేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. మిగిలిన వాళ్ళ కోసం సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇక ఒకే కుటుంబం లో ముగ్గురు మరణించడం తో ఆ గ్రామం లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలను పరయవేక్షిస్తున్నారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాల్లని రంగం లోకి దింపారు.