టీటీడీ పాలకమండలి సభ్యులు జాబితా ఫైనల్ : తెలంగాణ నుంచి వీరే !

తిరుమల : టిటిడి పాలకమండలి సభ్యులు జాబితా దాదాపుగా ఖరారైనట్లే కనిపిస్తోంది. మొదటి విడత లో పాలక మండలి సభ్యుల జాబితాను విడుదల చేసే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రెండో విడతలో ప్రత్యేక ఆహ్వనితుల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.

ttd
ttd

పాలక మండలి సభ్యులుగా ఏపి నుంచి పోకల అశోక్ కుమార్,మల్లాడి క్రిష్ణారావు,వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి,ఎమ్మేల్యేలు కాటసాని, గోర్ల బాబురావు, మధుసూదన్ యాదవ్ ఉండ నున్నారు.  తెలంగాణ నుంచి రామేశ్వరావు, లక్ష్మినారాయణ, పార్దసారధి రెడ్డి, మూరం శెట్టి రాములు, కల్వకుర్తి విద్యాసాగర్ లకు ఛాన్స్ దక్కనుంది.

ఇక అటు తమిళనాడు నుంచి శ్రీనివాసన్, ఎమ్మేల్యే నందకుమార్, కన్నయ్య లకు ఛాన్స్ దక్కగా.. కర్నాటక నుంచి శశిధర్, ఎమ్యెల్యే విశ్వనాధ్ రెడ్డి ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. అలాగే మహరాష్ర్ట నుంచి శివసేనా కార్యదర్శి మిలింద్ ను చోటు కల్పించనుంది ఏపీ సర్కార్, ఇక దీనిపై రేపు ప్రకటన వచ్చే అవకశాలు ఉన్నాయి.