టోకెన్లు తీసుకున్న వెయిటింగ్ లిస్ట్‌లోనే శవాలు

-

చెన్నై: కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఆస్పత్రుల్లో కుప్పలు తెప్పలుగా మృతదేహాలు మిగిలిపోతున్నాయి. వీటికి దహనసంస్కారాలు చేసేందుకు శ్మశాలు చాలడంలేదు. చెన్న నగరంలో వారం రోజులుగా కరోనాతో చనిపోయేవారి సంఖ్య మరీ అధికమైంది. . రోజుకు 75 మంది వరకు కరోనాతో మృత్యువాత పడుతున్నారు. సాధారణ మృతులు కూడా అదే సంఖ్యలో ఉన్నాయి. దీంతో ఒక చెన్నైలోనే దాదాపు 300 మృతదేహాలకు దహనసస్కారాల చేయాల్సి ఉంది. వీటిలో చాలా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించలేదు.

నగరంలో మొత్తం 68 శ్మశాన వాటికలు ఉన్నాయి. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు ఈ శ్మశానాలకు మృతదేహాలను తరలిస్తున్నారు. బీసెంట్‌ నగర్‌, వెలంగోడు, అరుంబాక్కం, విల్లివాక్కం తదితర శ్మశానవాటికల్లో ఒక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేలోపే మృతదేహం వస్తోంది. మరికొన్ని శ్మశానవాటికల్లో టోకెన్‌ విధానాన్ని అమలు చేస్తున్నాయి. దీంతో మృతుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా శ్మశాన వాటికలను 24 గంటల పాటు తెరిచివుంచాలని కోరుతున్నారు. ఖాళీగా ఉన్న శ్మశానవాటికల వివరాలను ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో పొందుపరచాలంటున్నారు. ఈ వినతులపై చెన్నై నగర పాలక సంస్థ అధికారులు స్పందించారు. ఈ సమస్య పరిష్కారానికి కొంతమంది అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోనుంది.

Read more RELATED
Recommended to you

Latest news